పాల్వంచ,వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ చోరీ జరిగింది. పాల్వంచ టౌన్ లోని నవ నగర్లో తాళాలు వేసిన 8 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నవ భారత్ కర్మాగారంలో ఎలక్ట్రికల్ విభాగం డీజీఎం ఇంటూరి గిరిధర్ బాబు, ప్రతాప్, ఆఫీసర్లు అంజద్ పాషా, విజయ్ ప్రకాశ్, సీవీఎస్ఎన్ ప్రసాద్, ఖాదరేంద్రబాబుతోపాటు పార్వతీ నాయుడు, వెంకటేశ్వర్లు సొంతూళ్లకు, బంధువుల వద్దకు వెళ్లారు. వీరి ఇండ్లను దొంగలు టార్గెట్ చేసి శనివారం అర్ధరాత్రి సొత్తును ఎత్తుకెళ్లారు.
విజయ్ ప్రకాశ్ ఇంట్లో 40 తులాల గోల్డ్, రూ. 5.05 లక్షలు, ప్రతాప్ ఇంట్లో 50 తులాల బంగారు ఆభరణాలు, పార్వతీ నాయుడు ఇంట్లో రెండు రింగ్ లు , గిరిధర్ బాబు ఇంట్లో గోల్డ్, నగదును రూ. 3 లక్షల విలువైనవి ఎత్తుకెళ్లారు. అంజద్ పాషా ఇంట్లో10 తులాల గోల్డ్ , రూ. 3 లక్షల నగదు చోరీ చేశారు. ఆదివారం ఘటన తెలియడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్, సీఐ సతీశ్, ఎస్ఐ సుమన్ ఫింగర్ ప్రింట్, డాగ్ స్క్వాడ్ టీమ్ లో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేశామని పూర్తి వివరాలు అందలేదని సీఐ సతీశ్తెలిపారు. ఆఫీసర్లు ఉండే నవనగర్ కాలనీలో భారీ చోరీ జరగడంతో సంచలనంగా మారింది.