
అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీ వైసీపీ నేత, నటుడు పోసాని ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ( మార్చి 18 ) ఆయనను కస్టడీకి తీసుకోనుంది సీఐడీ. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని విచారించేందుకు సీఐడీకి అనుమతిచ్చింది కోర్టు. ఈ క్రమంలో గుంటూరు జైల్లో ఉన్న పోసానిని స్థానిక జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం కస్టడీకి తీసుకుంది సీఐడీ.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై అసభ్యకర వ్యాఖ్యలు, ఫోటోల మార్ఫింగ్ పై పోసానిని విచారించనున్నారు సీఐడీ. సీఐడీ ప్రశ్నలకు పోసాని ఇచ్చే సమాదానాలు కీలకం కానున్నాయి. గతంలో పోలీసుల విచారణలో సజ్జల పేరు బయటపెట్టిన పోసాని.. ఇప్పుడు సీఐడీ విచారణలో ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.
Also Read:-వాలంటీర్లను కొనసాగించటం లేదు : షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నమోదైన కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చినప్పటికీ.. ఫోటోలు మార్ఫింగ్ కేసులో కస్టడీకి తీసుకుంది సీఐడీ. మరి, సీఐడీ విచారణ తర్వాత ఏం జరుగుతుంది.. బుధవారం ( మార్చి 19 ) పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణ ఉన్న నేపథ్యంలో ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.