
ప్రస్తుతం జనాల్లో భక్తి ప్రభావం ఎక్కువుగా ఉంది.. అందుకే పండగ వచ్చినా.. పబ్బం వచ్చినా.. హిందూపురాణాల ప్రకారం విశిష్టమైనరోజుల్లో ఉపవాస దీక్షను పాటిస్తారు. ఇలా ఉపవాసం 24 గంటలు అంటే ఒకరోజు ఏమీ తినకుండా శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఫాస్టంగ్ డేస్ లలో బాడీలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం. . .
సాధారణంగా ఉపవాసం అంటే రోజంతా ఉంటారు. ఆ 24 గంటలు ఏమీ తినరు. ఆ సమయంలో శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఉపవాసం వలన ఎన్ని ఉపయోగాలున్నాయో నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి: తిండి తినకపోతే గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి.. దీని వలన నీరసం వస్తుంది. అందుకే నిరాహార దీక్ష చేసే వారికి ఫస్ట్ షుగర్ టెస్ట్ చేసి వారి ఆరోగ్య విషయాన్ని ప్రాథమికంగా నిర్దారిస్తారు. 12 నుంచి 16 గంటల పాటు ఏమీ తినకపోతే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి. దీని ప్రభావం కాలేయంపై పడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసి అనారోగ్యానికి దారితీస్తుంది. అందుకే ఉపవాస దీక్షను పాటించే వారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
కొవ్వు కరుగుతుంది: ఉపవాసం ఉండే వారికి శరీరానికి పోషకాలు అందక కొవ్వు కరుగుతుంది. గ్లూకోజ్ నిల్వలు తగ్గి.. శక్తి తగ్గుతున్న కొద్ది.. రక్తంలోకి కొవ్వు చేరి కొంత శక్తిని ఇస్తుంది. ఇందులో ఉండే లిపోలిసిస్ అనే కొవ్వు ఆమ్లాలు .. కీటోన్ లు రక్తంలో కలుస్తాయి. దీనివలన మెదడు పనితీరు పెరగడమే కాకుండా.. నీరసాన్ని కూడా నిరోధిస్తుంది. అయితే రక్తంలో కొవ్వు అధికంగా చేరితే రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఉపవాసం ఉండే వారు 16 గంటలకు మించి ఉండకపోతే మంచిది.
కణాలు క్లీనింగ్: ఉపవాసం వలన శరీరంలోని కణాలు శుభ్రపడతాయి. ఏమీ తినకపోవడం వలన కణాలకు ఆహారం చేరదు..నిల్వ ఉన్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియలో కణాల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు క్లీన్ అవుతాయి. దీనివలన క్యాన్సర్.. అల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
హార్మోన్స్ పెరుగుదల : ఒక రోజు (24 గంటలు) ఉపవాసం ఉంటే శరీరంలోని హర్మోన్ (HGH) స్థాయిలు పెరుగుతాయి. దీనివలన జీవక్రియ పనితీరు మెరుగుపడుతుంది, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి.. శారీరక పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది.
ఏకాగ్రత పెరుగుతుంది: ఉపవాసం ఉండటం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకు ఫాస్టింగ్ ఉంటున్నామో.. దృష్టి అంతా అటే కేంద్రీకృతం కావడంతో మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. గ్లూకోజ్ లెవల్స్ తగ్గడం.. మెదడు కీటోన్లను ఉపయోగించుకొని పనిచేయడంతో అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది.
జీర్ణ వ్యవస్థ: ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం. అలా ఉన్నప్పుడు జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. ఫాస్టింగ్ వలన పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆకలి విషయంలో కొన్ని సంకేతాలను ఇస్తుంది. దాంతో ఉపవాస దీక్షను విరమించిన తరువాత పుష్టికరమైన ఆహారం తీసుకుంటారు.
ALSO READ : Good Food : ఎండాకాలంలో ఈ ఫుడ్ తినకపోతేనే మంచిది.. తింటే ఏమవుతుందో తెలుసుకోండి..!
ఆకలి: ఉపవాసం ఉన్నప్పుడు.. రోజూ ఆహారం తినే సమయానికి ఆకలి వేస్తుంది. ఆ తరువాత ఆకలి తగ్గుతుంది. మళ్లీ కొద్ది సేపటి తరువాత కొద్దిగా ఆకలి వేయడం జరుగుతుంది. తరువాత శక్తి కోసం కొవ్వునుఉపయోగించుకోవడంవలన ఆకలి తగ్గి యథాస్థితికి చేరుకుంటారు.
ALSO READ : కిచెన్ తెలంగాణ ఈ రెసిపీలు మ్యాంగో ఫ్లేవర్!
హైడ్రేషన్: ఉపవాసం ఉండి నీటిని తాగకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. నిర్జలీకరణ పెరిగి.. శరీరంలో గ్యాస్ పెరగడం.. కడుపులో మంట రావడం.. వంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే ఆహారం తీసుకోకపోయినా నీరు తాగితే సమతుల్యతను కాపాడుకోవడానికి ఎలక్ట్రోలైట్‌లు వృద్ది చెందేందుకు కచ్చితంగా నీరు తాగాలి.