అమ్రాబాద్, వెలుగు: మహాశివరాత్రి సదర్భంగా ఆదివాసీ చెంచుల బౌరాపూర్ జాతరకు ఒక్క రోజే పర్మిషన్ ఇస్తున్నట్లు డీఎఫ్ఓ, ఐటీడీఏ ఇంచార్జీ పీఓ రోహిత్ గోపిడి ప్రకటనలో తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా 8వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అడవి లోపలికి పర్మిషన్ ఉంటుందని తెలిపారు.
చెంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్ట్ లకు మాత్రమే అడవిలోకి అనుమతి ఉంటుందని ఇతరులకు అనుమతి లేదని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు అందరూ పరహాబాద్ గేటు బయటకు రావాలని కోరారు.