ఒకేరోజు టెట్, నెట్​ ఎగ్జామ్స్

  • డేట్లు మార్చాలని సర్కారుకు అభ్యర్థుల విజ్ఞప్తి  

హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్), టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఒకే షెడ్యూల్​లో జరగనున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం నెట్​ను జనవరి1 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్టు తాజాగా నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. 

రాష్ట్రంలో టీచర్ పోస్టులకు అర్హత కోసం టెట్ పరీక్షను జవనరి1 నుంచి 20 తేదీల మధ్యలో  నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. దీంతో  రెండు పరీక్షలు ఒకే షెడ్యూల్​లో ఉండటంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నది. జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష వాయి దా వేయడం కుదరదని, కాబట్టి రాష్ట్రస్థాయిలో నిర్వహించే టెట్​ను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.