బీఆర్ఎస్​ ప్రచార ర్యాలీలో అపశృతి

బీఆర్ఎస్​ ప్రచార ర్యాలీలో అపశృతి

మేడిపల్లి, వెలుగు: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఒకరు మృతిచెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం.. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బోడుప్పల్ కార్పొరేషన్ పరిధి దేవేందర్ నగర్ లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహిస్తున్నారు. 

పాటల కోసం ఏర్పాటు చేసిన డీజే వెహికల్ బ్రేకులు ఫెయిలై అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లడంతో చిలుక నగర్ చెందిన శ్రవణ్ (24) స్పాట్ లో మృతిచెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేశారు.