నాలుగేళ్లుగా ఇంట్లోనే: జగన్ పరిపాలన బాగా చేస్తేనే బయటకు వస్తారట

నాలుగేళ్లుగా ఇంట్లోనే: జగన్ పరిపాలన బాగా చేస్తేనే బయటకు వస్తారట

ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో ఓ కుటుంబం వింతగా ప్రవర్తిస్తుంది. ఇప్పటివరకు నాలుగు సంవత్సరాలుగా ఇంట్లోంచి బయటకు రాకుండా జీవిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. వాళ్ల పిల్లలను కూడా స్కూల్ కు పంపించడంలేదు. ఎందుకని ఆరాతీయగా.. ఆ రాష్ట్ర సీఎం జగన్ బాగా పరిపాలన చేస్తేనే తాము తమ పిల్లలను స్కూల్ కు పంపుతామని వింత సమాదానాలు చెప్తున్నారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి టౌన్ లో ఈసపు ఈశ్వరరావు తన భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నారు. మీడియా ఈ విషయంపై.. ఆరాతీయగా.. కొంతకాలంగా వీరు వింతగా ప్రవర్తిస్తున్నారని చుట్టుపక్కలవారు చెప్పారు. వీరు బయట వారితోగాని,  పక్కింట వాళ్లతో గాని ఎటువంటి సంబంధం లేకుండా కేవలం ఇంట్లోనే గడుపుతున్నారని తెలిపారు. ఎప్పుడు చూసినా ఇంటికి లోపల నుంచి తాళం వేసి ఉంటుందని… నెలకి కావాల్సిన కిరాణం సామానును ఒకేసారి కొని ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత మళ్లీ ఎప్పటిలాగే తాళం వేసుకుంటారని చెప్పారు. ఎవరిని లోపలకు రానీయరని. ఎవరితోనూ మాట్లాడారని తెలిపారు. కనీసం వారి సమీప బంధువులతో కూడా కలవకుండా ఉన్నారని… వీరికి ఆదాయం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదని చెప్పారు.

మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు…ఆ ఇంటికి వెళ్లి విచారించారు. స్కూల్ కు పిల్లలను ఎందుకు పంపడంలేదన్న ప్రశ్నకు… సీఎం జగన్ పరిపాలన సరిగ్గాచేస్తేనే పిల్లలను స్కూల్ కు పంపుతామని వింత సమాదానం చెప్పారు. లోకల్ గా అభివృద్ధి జరగలేదని జగన్ తనకు అధికారం ఇస్తే స్థానికంగా డెవలప్మెంట్ చేస్తామని అన్నారు.

కనీసం పిల్లలను స్కూలుకు పంపాలని పోలీసులు కోరగా అందుకు బలవంతంమీద ఒప్పుకున్నారు. జిల్లా ఏఎస్పీ గౌతమి శాలీ మాట్లాడుతూ..   ఆ కుటుంబానికి సంబంధించి ఎటువంటి మానసిక సమస్య ఉందో తెలుసుకొని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పిల్లలు మైనర్లు కాబట్టి, వారిని పాఠశాలకు పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరిన్ని వార్తలకోసం క్లిక్ చేయండి

అయోధ్య: రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేసిన మోడీగాంధీ హాస్పిటల్ లో కరోనా టెస్టులు
గాంధీ హాస్పిటల్ లో కరోనా టెస్టులు

ఈ నెలలో విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..!

చర్మ ఆరోగ్యానికి నలుగు.. ఇలా తయారు చేసుకోండి