ఒకరినొకరు రక్షించడానికి వెళ్లి అయిదుగురు మృతి చెందిన విషాద ఘటన గుజరాత్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోటాడ్ పట్టణంలో ఉంటున్న ఇద్దరు బాలురు స్థానిక కృష్ణ సాగర్ నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో నీట మునగడంతో కేకలు వేశారు. అరుపులు విన్న మరో ముగ్గురు వీరిని రక్షించేందుకు నీటిలో దూకారు.
వారూ అందులోనే మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అయిదుగురి డెడ్ బాడీస్ ని బయటకు తీశారు. మృతులందరూ 16 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కు గల వారేనని బాటోడ్ ఎస్పీ బలోలియా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.