ఎంత పంచినా తరగని సంపద చదువు. అందుకే 102 ఏళ్ల వయసులోనూ పిల్లలకి పాఠాలు చెప్తున్నాడు ఒడిశాకి చెందిన నందా పృస్టీ. ఉదయాన్నే నిద్రలేవడం.. గబగబా ఇంట్లో పనులన్నీ ముగించుకుని స్కూల్‌కి వెళ్లడం. పిల్లల్ని ఆడుతూ, పాడుతూ చదివించడం.. గత 70 ఏళ్లుగా నందా పృస్టీ దినచర్య ఇదే. ఒకే ఫ్యామిలీలో నాలుగు జనరేషన్స్‌కి చదువు చెప్పిన ఘనత కూడా ఈయనకి ఉంది.
ఒడిశాలో జైపూర్ జిల్లాలోని కాంతిరా అనే ఊళ్లో ఈ ‘ నందా సర్’ చాలా ఫేమస్.. ఈయన చదువు చెప్పే పద్ధతి, పిల్లలతో మెలిగే విధానం నచ్చి చుట్టు పక్కల వాళ్లంతా తమ పిల్లలకి ఈయన దగ్గరే చదువు చెప్పిస్తున్నారు. స్కూల్లో అడుగుపెడితే చాలు చిన్న పిల్లాడు అయిపోతాడట నందా. వాళ్లతో టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదంటున్నాడు. అలాగని నన్ను కూల్ మాస్టర్ అనుకోవడానికి లేదు చదువుపై అశ్రద్ధ చేసినా, క్రమశిక్షణ తప్పినా పిల్లల్ని గట్టిగానే మందలిస్తా అంటున్నాడు. 70 ఏళ్లుగా ఈ వృత్తిలోనే ఉన్నాను.
పదిమందికి చదువు చెప్పడంలో తెలియని సంతోషం దాగుంది. ఎవరైనా నా స్టూడెంట్ కనిపించి ‘పలానా ఉద్యోగం చేస్తున్నా సర్’ అని చెప్తే అప్పుడు కలిగే సంతోషం కొన్ని కోట్లు పెట్టినా కొనలేం. బతికున్నంత కాలం ఈ వృత్తిలోనే ఉంటా. వీలైనంత ఎక్కువమంది పేదపిల్లలకి చదువు చెప్పడమే నా లక్ష్యం అంటున్నాడు ఈ మాష్టార్. అంతేకాదు కరోనా టైంలో కూడా ఆపకుండా క్లాస్‌లు చెప్పాడు.
For More News..