కామారెడ్డి టౌన్, వెలుగు: ముంబై నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలులో మంగళవారం కామారెడ్డిలో ఎక్సైజ్, ఆర్పీఎఫ్పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైలులో అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సీఐ విజయ్‌కుమార్, ఎస్ఐ విక్రమ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.