
- పోలీసుల స్పెషల్ డ్రైవ్.. కౌన్సెలింగ్
నిర్మల్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నిర్మల్ఎస్పీ జానకి షర్మిల స్పెషల్ఫోకస్పెట్టారు. ఆమె ఆదేశాల మేరకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు వంద మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. వారు నడుతున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులు, వెహికల్ఓనర్లు 296 మందికి ఆయా పోలీస్ స్టేషన్లలో అడిషనల్ ఎస్పీలు రాజేశ్ మీనా, అవినాశ్ కుమార్, ఉపేందర్ రెడ్డి తదితరులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెహికల్స్ ఇవ్వొద్దని హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.