బసంత పంచమి సందర్భంగా లక్ష పెన్నుల పూజ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోమవారం (ఫిబ్రవరి 3) చదువుల తల్లి సరస్వతికి ఇష్టమైన రోజైన బసంత పంచమి కావడంతో సరస్వతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుని సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున ఆంధ్రప్రదేశ్ లోని ఐనవిల్లి గణపతి ఆలయంలో లక్ష పెన్నులతో పూజలు చేయడంవైరల్ గా మారింది.
ఐనవిల్లి గణపతి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని ఐనవిల్లి దగ్గర ఉంది. భక్తులు తమ పిల్లలకు చదువు బాగా రావాలని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజులుగా జరిగిన ఈ వేడుకల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు సరస్వతి దేవి సమక్షంలో ‘అక్షరాభ్యాసం’ చేయించారు. విద్యార్థులు పలకలపై మొదటి సారిగా అక్షరాలు దిద్దుతూ ‘అక్షరాభ్యాసం’ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
Also Read :- భగ్గుమంటున్న బంగారం.. తులం ధర ఎంతైందంటే
అయితే లక్ష పెన్నులతో అర్చకులు పూజలు నిర్వహించడం వైరల్ అయ్యింది. లక్ష పెన్నులను గణపతి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం పెన్నులను పిల్లలకు పంచి పెట్టారు. బసంత పంచమి వేడుకల సందర్భంగా లక్ష పెన్నులను విద్యార్థులకు పంచడం వైరల్ అయ్యింది.
ప్రతి బసంత పంచమి వేడుకల సందర్భంగా ఐనవిల్లి గణపతి ఆలయంలో పూజలు నిర్వహిస్తామని చెబుతున్నారు అర్చకులు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ఉంది ఐనవిల్లి గణపతి ఆలయం. వ్యాసుడు దక్షిణాపథం వచ్చిన సందర్భంగా ఇక్కడ గణపతిని ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతోంది. మాగ శుధ్ద పంచమి లేదా బసంత పంచమిన సరస్వతి దేవికి, గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.