డేటాఫ్ బర్త్ తప్పుందని లక్ష రూపాయలు కొట్టేసిండ్రు

కామారెడ్డి జిల్లాలో డేటాఫ్ బర్త్ పేరిట సైబర్ మోసం చోటుచేసుకుంది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుభాష్ రావుకు క్రెడిట్ కార్డులో డేటాఫ్ బర్త్ తప్పుగా ఉందని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. డేటాఫ్ బర్త్ సరిచేయాలని, అందుకు ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సుభాష్ ను నమ్మించారు. ఆ తర్వాత సుభాష్ రావు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగా... రూ.1,06,910 అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత తనకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా ఆ నెంబర్ కు ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన సుభాష్ రావు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి.. స్థానిక సదాశివనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై  సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.