సలార్ రీ రిలీజ్ కి అదిరిపోయే రెస్పాన్స్.. లక్ష టికెట్లు తెగాయట..

సలార్ రీ రిలీజ్ కి అదిరిపోయే రెస్పాన్స్.. లక్ష టికెట్లు తెగాయట..

టాలీవుడ్ సర్లింగ్ హీరోగ నటించిన సలార్ రీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇందులోభాగంగా మార్చ్ 21న సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తదితర భాషలలో శుక్రవారం రిలీజ్ కానుంది. ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్, క్రేజ్ ఉండటంతో అప్పుడే బాక్సాఫిస్ వద్ద సలార్ సందడి మొదలైంది. 

అయితే ఇప్పటివరకూ సలార్ కోసం దాదాపుగా 550 షోలు ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేశారు మేకర్స్. దీంతో బుక్ మై షోలో దాదాపుగా లక్షకి పైగా టికెట్లు అమ్ముడయినట్లు సమాచారం.  రిలీజ్ కి ముందే సలార్ పార్ట్ 1 దాదాపుగా రూ.1.8 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ శాతం బిజినెస్ జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో మాత్రమే రూ.45 లక్షలకి పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. కర్ణాటక, తమిళ్ లో మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే హిందీ నుంచి మాత్రం పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు.. 

Also Read :- కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్.. అప్పటిదాకా ఆగాలంటూ..

ఈ విషయం ఇలా ఉండగా సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌ కి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటించగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో స్నేహితుడి పాత్రలో నటించాడు. బాబీ సింహా, శ్రియా రెడ్డి, ఝాన్సీ, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర తారాగణంగా నటించారు. సాలీడ్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా రూ. 700 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలైన నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతోంది.