మత్తడిపై సెల్ఫీ.. జారిపడి స్టూడెంట్​ మృతి

పరకాల,  వెలుగు:  హనుమకొండ జిల్లా నడికూడ  మండలం కంఠాత్మకూరులో సెల్ఫీ సరదా  ఓ స్టూడెంట్​ ప్రాణం తీసింది. దామెర ఎస్సై ముత్యం రాజేందర్​ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ  కిట్స్​ కాలేజీలో బీటెక్ ఫస్టియర్​ చదువుతున్న అబ్దుల్​ షాజాద్​ఖాన్​,  ఎస్​డీ జాయద్​, కాజీపేటకు చెందిన ఎండీ ఇస్మాయిల్​ అనే ముగ్గురు ఫ్రెండ్స్​ గురువారం  కంఠాత్మకూరు మత్తడిని చూసేందుకు వచ్చారు.  

మత్తడి వద్ద ముగ్గురూ సెల్ఫీ తీసుకుంటుండగా ఇస్మాయిల్​(18)  పాకురుతో జారి కింద పడ్డాడు.   ఫ్రెండ్స్​ కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.   సమాచారం అందుకున్న పోలీసులు డెడ్​ బాడీని బయటకు తీశారు.