వర్గీకరణపై సమగ్ర అధ్యయనం

వర్గీకరణపై సమగ్ర అధ్యయనం
  • కమిటీ చైర్మన్​జస్టిస్​ షమీమ్​అక్తర్​ 

​నిజామాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అన్ని కోణాలలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్టు ఏకసభ్య కమిషన్​ చైర్మన్​జస్టిస్​షమీమ్​అక్తర్​వెల్లడించారు. ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాలు పర్యటించి అభిప్రాయాలు సేకరించామన్నారు. గురువారం నిజామాబాద్​ కలెక్టరేట్​లో ఉమ్మడి జిల్లాకు సంబంధించి బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఎస్సీ వర్గీకరణతో ఆ వర్గాల సామాజిక స్థితిగతులపై బహిరంగ విచారణ జరిపి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు. 

నిర్భయంగా తమను కలవడానికి రావాలన్నారు. కమిషన్​ చైర్మన్​కు మొత్తం 555 వినతి పత్రాలు అందించారు. ఉమ్మడి జిల్లా  ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆఫీసర్లు, న్యాయవాదులు ఆయనను కలిసి వర్గీకరణపై తమ అభిప్రాయాలు తెలిపారు. ఆయా కులాలకు చెందిన వ్యక్తులు సంప్రదాయ వేషధారణతో వచ్చారు. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు, ఎస్సీ డెవలప్మెంట్​స్టేట్​అడిషనల్ డైరెక్టర్​ శ్రీధర్, అదనపు కలెక్టర్​అంకిత్, ట్రైనీ కలెక్టర్​ సంకేత్, ఉమ్మడి జిల్లాల ఆఫీసర్లు నిర్మల, రజిత పాల్గొన్నారు.

ముప్కాల్​ఎస్సీ కాలనీ విజిట్​

ఆర్మూర్ ​సెగ్మెంట్​లోని ముప్కాల్​ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీని కమిషన్​ చైర్మన్​విజిట్​ చేశారు. ఉపాధి కోసం గల్ఫ్​వెళ్లిన వారి కుటుంబాల ఆర్థిక స్థితి, ఓవర్సీస్​స్కాలర్​షిప్స్​ పొందిన స్టూడెంట్స్​వివరాలు, ప్రభుత్వ​ స్కీంల నుంచి లబ్ధి పొందిన సమాచారం సేకరించారు.  ఆర్డీవో రాజాగౌడ్​ తదితరులు ఆయన  వెంట ఉన్నారు. నిజామాబాద్​ వచ్చిన కమిషన్​ చైర్మన్​ షమీమ్​ అక్తర్​ను స్టేట్​ఉర్దూ అకాడెమీ చైర్మన్​ తాహెర్, బార్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​జగన్మోహన్​గౌడ్​ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఎస్సీ కాలనీని సందర్శించిన ఏకసభ్య కమిషన్

బాల్కొండ, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం బహిరంగ విచారణకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌‌‌‌ గురువారం ముప్కాల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీని సందర్శించింది. ఈ సందర్భంగా స్థానికులను కలిసి వారిస్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు? ఇతర రంగాలలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? అనే విషయాలను తెలుసుకున్నారు.

 గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి, విదేశాలలో ఉన్నత విద్య కోసం ఓవర్సీస్ పథకం కింద పొందే లబ్ది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తున్న కుటుంబాలు, బీడీ కార్మికులకు పెన్షన్ తదితర వివరాలు తెలుసుకున్నారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన వివిధ వర్గాల వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిశీలించి, ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో అన్ని అంశాలను పొందుపరుస్తామని ఏకసభ్య కమిషన్ చైర్మన్​ జస్టిస్ షమీమ్ అక్తర్ తెలిపారు. ఆయన వెంట షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అదనపు సంచాలకుడు శ్రీధర్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, సీడీఓ నిర్మల  తదితరులు ఉన్నారు.