ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ ప్రభాకర్ చేసిన ఫిర్యాదు మేరకు నానిపై గుడివాడ పోలీసులు కేస్ నమోదు చేశారు.
కొడాలి నాని సహా ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, గతంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసిన మాధవీలత రెడ్డిలను కూడా తన ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్నారు ప్రభాకర్. ఈ నేపథ్యంలో వీరి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 448, 427, 506, ఆర్ అండ్ డబ్ల్యూ 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గుడివాడ పోలీసులు.