Hero Suhas: మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్న బలగం ప్రొడ్యూసర్స్..టైటిల్, టీజర్ అప్డేట్ ఇదే

టాలీవుడ్  టాలెంటెడ్ నటుడు సుహాస్ (Suhas) ఈ మధ్య వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా అమ్మాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్న వదనం వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మరో సినిమాని ప్రకటించేశాడు. 

తాజగా ప్రముఖ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి "జనక అయితే గనక” (Janaka Aithe Ganaka) అంటూ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సుహాస్ హీరోగా సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.ఇందుకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ ను రిలీజ్  చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ను మేకర్స్ జోడించారు. 

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో సుహాస్ తలను పట్టుకున్నట్లుగా కనపడుతుంది.”ఆనందం పట్టలేనంత..బాధలు చెప్పుకోలేనంత..నవ్వులు ఆపుకోలేనంత..” అనే విధంగా సినిమా ఉంటుందని మేకర్స్ క్యాప్షన్ ద్వారా చెప్పుకొచ్చారు.దీన్ని బట్టి ఆలోచిస్తే..ఈ సినిమా ఆద్యంతం  కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

 

దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై బలగం ఫేమ్ హన్సితా రెడ్డి,హర్షిత్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో సుహాస్ కి జోడిగా సంగీర్త‌న విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాకు విభిన్నమైన ట్యూన్స్ తో అలరించే విజయ్ బుల్గ‌నిన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.జనక అయితే గనక నుంచి జూలై 4న టీజర్  కూడా రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో సుహాస్ ఫ్యాన్స్ కి వెయిటింగ్ షురూ అయింది. 

సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిన ఈ నటుడు..మెల్లిగా సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించడం మొదలుపెట్టాడు.కలర్ ఫోటో సినిమాతో సోలో హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సుహాస్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. హీరోగా వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకున్నాడు. అతని హిట్ జాబితాలో ఈ సినిమా మరో హిట్ గా నిలవడం గ్యారెంటీ అని తెలుస్తోంది.టీజర్ రిలీజయ్యాక మరింత నమ్మకం పెరిగే అవకాశం ఉంది.