ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లలో ఏవైనా తప్పులు దొర్లితే ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్లి సరి చేసుకోవచ్చు. కానీ, ట్విట్టర్లో ఆ వెసులు బాటు లేదు. ఏదైనా పోస్ట్‌లో అక్షరాలు కాస్త అటు ఇటు అయితే డిలిట్ బటన్ నొక్కి రీపోస్ట్ చేయాల్సిందే. లేదా అలాగే వదిలేయాలి. కానీ, ఇకనుంచి ట్విట్టర్లో ఆ సమస్య ఉండదు. ఎందుకంటే ట్విట్టర్లోనూ ఎడిట్ బటన్ ఆప్షన్ రానుంది. దాన్ని క్లిక్ చేసి ఎంచక్కా పోస్టుల్లో తప్పుల్ని సరిచేసుకోవచ్చు. అయితే కొందరు ఈ ఆప్షన్ని తప్పుడు పనులకు వాడే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి యూజర్స్‌కి ఎడిట్ చేసిన పోస్ట్‌తో పాటు మొదట చేసిన పోస్ట్‌ని చూసే అవకాశం కూడా ఇస్తుందట ట్విట్టర్. త్వరలోనే ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ట్విట్టర్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ హెడ్ జె సల్వెన్ చెప్పారు.