పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కొత్త సినిమాపై రోజుకో న్యూస్ సోసిల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. రోజుకో టైటిల్ పుట్టుకొస్తూనే ఉంది. అసలీ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటివరకు రాలేదు. కానీ షూటింగ్ మాత్రం జరుగుతుందనే వార్తలు వినిపించాయి. దానికి సంబంధించిన లీకుడు ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ కాంబో మరెవరిదో కాదు ప్రభాస్ అండ్ మారుతీ(Maruthi).
ఈ కాంబోలో సినిమా వస్తుందని తెలిసినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి? ప్రభాసన్నా ఈ సినిమా చేయడం అవసరమా అంటూ కామెంట్స్ కూడా చేశారు. కానీ మేకర్స్ మాత్రం చాలా సైలెంట్ గా, కనీసం అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేకుండా షూటింగ్ మొదలుపెట్టేశారు. హారర్ అండ్ కామెడీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు సంబందించిన లీకుడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
అయితే ఈ ప్రాజెక్టు కోసం రోజుకో టైటిల్ తెరపైకి వస్తోంది. ముందుగా ఈ సినిమాకు రాజా డీలక్స్(Raja Delux) అనే టైటిల్ ఫిక్స్ చేశారనే వార్తలు వినిపించాయి. తరువాత అంబాసిడర్(Ambassador) అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరో టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు వింటేజ్ కింగ్(Vintage king) అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఈ మూడింటిలో ఏ టైటిల్ ను ప్రభాస్ సినిమాకు ఫిక్స్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, నార్మల్ ఆడియన్స్ కూడా ఆతృతగా చూస్తున్నారు.