
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' పై స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వ స్థిరత్వంతో, అభివృద్ధికి వేగవంతమైన పాలన అవసరమని, ఈ దృక్కోణంతో, 'ఒక దేశం, ఒకటే ఎలక్షన్' అనేది మెచ్చుకోదగ్గ ప్రయత్నమని అన్నారు. "సంపన్నమైన ప్రజాస్వామ్యానికి, రాజకీయ స్థిరత్వం నిజంగా ముఖ్యమైనది. ప్రజాస్వామ్య, ప్రభుత్వ స్థిరత్వంతో, అభివృద్ధి కోసం వేగవంతమైన పాలన అవసరం. ఈ క్రమంలో 'ఒక దేశం, ఒకే ఎన్నికలు అనేది మెచ్చుకోదగ్గ ప్రయత్నం" అని చెప్పారు. ఈ విధానంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సీఎం.. "ఒకే దేశం, ఒకే ఎన్నిక" కోసం ఏర్పాటు చేసిన కమిటీ మాజీ రాష్ట్రపతి (రామ్ నాథ్ కోవింద్) అధ్యక్షతన ఏర్పడినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు.
"ఈ వినూత్న చొరవ కోసం, ఉత్తరప్రదేశ్ పౌరుల తరపున నేను ప్రధాని మోడీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను" అని సీఎం యోగి తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ, 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అనేది ఈ సమయంలో ఆవశ్యకమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఇతర రకాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావడానికి గల అవకాశాలను కమిటీ పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, లా కమిషన్, నీతి అయోగ్ గతంలో 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' ప్రతిపాదనను పరిశీలించి, ఈ అంశంపై నివేదికలను సమర్పించాయి.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath on 'One Nation, One Election'
— ANI (@ANI) September 1, 2023
"It is a praiseworthy effort. On behalf of the people of UP, I express gratitude towards the PM for this. 'One nation, one election' is the necessity of the day. During the process of elections, development… pic.twitter.com/pM6mYdSz3S