
హైదరాబాద్ సిటీ, వెలుగు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి తొలిరోజు శుక్రవారం ఒక నామినేషన్ దాఖలైంది. స్వతంత్ర అభ్యర్థిగా చలిక చంద్రశేకర్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంత్ కి నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఏప్రిల్ 4 వరకు నామినేషన్లకు అవకాశముంది. ఏప్రిల్ 7న స్క్రూటినీ, ఏప్రిల్ 9 వరకు నామినేషన్ల విత్ డ్రా కు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 23న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 25న కౌంటింగ్ జరగనుంది.