ఉలిక్కిపడ్డ హైదరాబాద్.. మేడ్చల్లో ‘రక్త చరిత్ర’ మర్డర్.. పట్టపగలు నడిరోడ్డుపై ఎలా చంపారో చూడండి..

ఉలిక్కిపడ్డ హైదరాబాద్.. మేడ్చల్లో ‘రక్త చరిత్ర’ మర్డర్.. పట్టపగలు నడిరోడ్డుపై ఎలా చంపారో చూడండి..

హైదరాబాద్లో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది.  ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో ఒకరిపై విరుచుపడ్డారు. సినిమా తరహాలో పోటు మీద పోటు పొడుస్తూ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. అందరూ చూస్తుండగా.. ఎలాంటి భయం లేకుండా దారుణంగా హత్యకు పాల్పడటంతో మేడ్చల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

వివరల్లోకి వెళ్తే.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమేష్ (25) అనే వ్యక్తిని నడి రోడ్డు పై కత్తులతో పొడిచి చంపేశారు ఇద్దరు‌‌ వ్యక్తులు. రోడ్డుపై వాహనాలు వెళ్తూనే ఉన్నాయి.. అందరూ నడుస్తూనే ఉన్నారు.. ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేకుండా పొడిచేశారు. ఇద్దరూ మర్డర్ చేసి చేతుల్లో కత్తులు పట్టుకుని దర్జాగా రోడ్డు దాటి వెళ్లిపోయారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి దర్యాప్తు మొదలు పెట్టారు. ఉమేష్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఈ హత్య వెనుక ఏమైనా పాత కక్షలు ఉన్నాయ మరేదైనా కోణం ఉందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.