- ఎంసెట్ పరీక్ష రాసి వస్తుండగా ఘటన
ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన సందీప్(21), సింధు, గుర్వాయిగూడెం తండాకు చెందిన హరితలు బైక్ పై వెళ్తున్నారు.
జీళ్లచెరువు సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తుండగా వారి బైక్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్ మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మంలో ఎంసెట్ పరీక్ష రాసి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.