మూసాపేట, వెలుగు: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు చనిపోయిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన రోహిత్(24) కొంతకాలంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వీఎన్ఆర్ కాలేజ్ సమీపంలోని వాసవి అర్బన్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
బుధవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ 4వ అంతస్తులో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.