![అమెరికాలో మరోసారి రెండు విమనాలు ఢీ.. రన్ వేపై ఉన్న జెట్ ఢీకొట్టిన మరో జెట్](https://static.v6velugu.com/uploads/2025/02/one-person-passed-away-4-injured-after-jets-collide-at-scottsdale-airport_A0S6s2WwaQ.jpg)
అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఢీకొన్నాయి. మంగళవారం (ఫిబ్రవరి11) స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్టులో ఆగివున్న విమానాన్ని మరో విమానం ఢీకొట్టింది..సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.
స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్టులోని రన్ వే 21పై బాంబార్డియర్ లియర్ జెట్ 35A ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి మరో ఎయిర్ జెట్ గల్ఫ్ స్ట్రీమ్ G200 ను ఢీకొట్టిం ది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.మరో నలుగురు గాయపడ్డారని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.
ఎయిర్ పోర్టు అథారిటీ వివరాల ప్రకారం..ఈ సంఘటన అమెరికా కాలమానం సోమవారం మధ్యాహ్నం 2:45 గంటలకు స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్టులోని రన్‌వే 21లో జరిగింది.
ఈ ప్రమాదంలో విమానం శిథిలాల్లో చిక్కుకునపోయిన మృతదేహాన్ని బయటకు తీయడానికి అధికారులు సాయంత్రం వరకు శ్రమించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తును జాతీయ రవాణా భద్రతా బోర్డుకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.