మరిపెడ,వెలుగు: చేపలు పట్టడానికి కొందరు వ్యక్తులు ఏరులో కరెంటు వైర్ పెడితే .. ఆ వైరు ఏరు దాటడానికి ప్రయత్నించిన వ్యక్తి తాకడంతో అతను అక్కడే చనిపోయాడు. ఈ ఘటన మరిపెడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని ఉల్లేపల్లి గ్రామానికి చెందిన ఆబోతు ఎల్లయ్య(32) మంగళవారం వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు ఆకేరు వాగు దాటడానికి ప్రయత్నించాడు.
అప్పటికే కొందరు వ్యక్తులు వాగులో చేపలు పట్టడానికి కరెంటు వైర్లు పెట్టడంతో.. వైరు ఎల్లయ్యకు తాకింది. దీంతో షాక్ తగిలి ఎల్లయ్య అక్కడే చనిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఎల్లయ్యకు భార్య,కూతురు ఉన్నారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.