హైదరాబాద్, వెలుగు : బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) కంపెనీ వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్ 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం రూ. 6.06 కోట్లు ఉండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.2.95 కోట్ల లాభం పొందింది.
నికర లాభం సంవత్సరానికి 100 శాతానికి పైగా ఎగిసింది. అమ్మకాల విలువ 45 శాతం వృద్ధితో రూ.52.3 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.35.6 కోట్లు అమ్మకాలను సాధించింది.