అక్కన్నపేట రైల్వేస్టేషన్​లో వన్ ప్రొడక్ట్ స్టాల్ ప్రారంభం

రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ లో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ లో భాగంగా స్టాల్​ను  ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్​గా  ప్రారంభించారు. కార్యక్రమానికి రైల్వే సీనియర్ ఇంజనీర్ శ్రీతేజ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కుల వృత్తులు, చేతి వృత్తుల వారు పండ్లు, ఇతర ఉత్పత్తులు అమ్ము కోవడానికి ఈ స్టాల్స్​ ఉపయోగపడతాయన్నారు. అనంతరం  అజంతా, రాయలసీమ ఎక్స్ ప్రెస్ హాల్టింగ్​ ఇవ్వాలని ఆయనకు స్థానిక నాయకులు వినతి పత్రం అందజేశారు.