
వరంగల్ జిల్లా : మార్కెట్‌లో ఎండు మిర్చికి ఫుల్ గిరాకీ వస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగిపోతోంది. ఎర్రబంగారానికి రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. తాజాగా వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో దేశీ మిర్చి అధిక రేటు పలికింది. దేశీ కొత్త మిర్చి ఒక క్వింటాకు రూ. 80,100 ధర పలికింది. ఏనుమాముల మార్కెట్ చరిత్రలోనే దేశీ కొత్త మిర్చికి రికార్డ్ ధర పలికిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ వరంగల్‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్. పత్తి తర్వాత భారీగా వచ్చే పంట మిర్చి. ఈ మార్కెట్‌కు తేజ, వండర్ హార్ట్ , 341 సింగల్ పట్టి, దేశీ మొదలైన రకాల వెరైటీ మిర్చీలు విక్రయించేందుకు రైతులు ఏనుమాముల మార్కెట్‌కు తీసుకువస్తూ ఉంటారు.