వన్​ ర్యాంక్ వన్​ పెన్షన్’కు పదేండ్లు

వన్​ ర్యాంక్  వన్​ పెన్షన్’కు పదేండ్లు
  • సైనికుల త్యాగాలపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్

న్యూఢిల్లీ: మాజీ సైనికుల సంక్షేమం కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘వన్​ర్యాంక్–వన్​ పెన్షన్’ పథకాన్ని ప్రారంభించి పదేండ్లు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ట్విట్టర్​లో స్పందించారు. ‘వన్‌‌ ర్యాంక్– వన్ పెన్షన్’ అమలు అనేది దేశాన్ని రక్షించడానికి తమ జీవితాలను త్యాగం చేసిన మాజీ సైనిక సిబ్బంది ధైర్యం, త్యాగాలకు అసలైన నివాళి లాంటిదని పేర్కొన్నారు.

 దశాబ్ద కాలంగా లక్షలాది మంది పెన్షనర్లు, పెన్షనర్ కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందాయని గుర్తు చేశారు. సాయుధ బలగాలను బలోపేతం, దేశానికి సేవ చేసే వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు. 2014 లోక్‌‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ‘వన్‌‌ ర్యాంక్ - వన్ పెన్షన్’ పథకంపై హామీ ఇచ్చింది. ఆ మేరకు అధికారంలోకి రాగానే దీన్ని అమలు చేసింది.