సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్

యాదాద్రి: యాదాద్రిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు సరైన సదుపాయాలు ఏర్పాటుచేయకపోవడంతో క్యూ లైన్లలో ఇక్కట్లు పడుతున్నారు. కొండ కింద కల్యాణకట్ట వద్ద దర్శన టికెట్ల కోస‌ం భక్తలు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. సెల్ ఫోన్లు భద్రపర్చడం కోసం క్లోక్ రూం వద్ద సపరేట్ కౌంటర్లు ఏర్పాటుచేయకపోవడంతో మహిళా భక్తులు అవస్థలు పడుతున్నారు.

కాగా.. ఆలయ ఆఫీసర్ల సన్నిహితులు మాత్రం యథేచ్ఛగా ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లి ఫొటోలు దిగుతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కొండపైకి వాహనాలను నిషేధించారు. అయితే ఆలయ ఆఫీసర్ల బంధువులు, సన్నిహితుల వాహనాలను మాత్రం కొండపైకి అనుమతిస్తున్నారు. దాంతో మిగతా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దగ్గర కూడా పక్షపాతం ఏంటని ప్రశ్నిస్తున్నారు.