- సోనియా కామెంట్స్‌పై మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ ‘పూర్ థింగ్స్’ అంటూ చేసిన కామెంట్స్‌ను ప్రధాని మోదీ తప్పుపట్టారు. ఢిల్లీలోని ద్వారకాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సోనియాగాంధీ ఫ్యామిలీపై మోదీ ఫైర్అయ్యారు.
రాష్ట్రపతి ప్రసంగం ఆ రాయల్ ఫ్యామిలీ (సోనియా ఫ్యామిలీ)కి నచ్చలేదని, ఒకరేమో రాష్ట్రపతి అలసిపోయారని అంటే.. ఇంకొకరు ఆమె స్పీచ్ బోరింగ్ అంటున్నారని మండిపడ్డారు. వారికి అర్బన్ నక్సల్స్ ముచ్చట్లు నచ్చుతాయని కాంగ్రెస్‌కు చురకలంటించారు. ఆకుటుంబం దురహంకారం ఈరోజు పూర్తిగా బయటపడిందని మోదీ అన్నారు.