విశ్లేషణ : జైళ్లు.. ఖైదీలు శిక్ష అనుభవించే స్థలాలే తప్ప, శిక్షించే స్థలాలు కాకూడదు. ఎందుకంటే ఖైదీలకు కూడా హక్కులుంటాయి. చట్టబద్ధమైన పద్ధతిలో నిర్బంధించినప్పుడు కోల్పోవాల్సి వచ్చిన హక్కులు తప్ప.. సగటు మనిషికి ఉన్న హక్కులన్నీ వాళ్లకూ ఉంటాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రూల్స్‌కు విరుద్ధంగా జైళ్లలో పరిమితికి మించి ఖైదీలను ఉంచుతున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నా.. కొన్ని సబ్ జైళ్లను మూసేసిన ప్రభుత్వం.. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చేసిన తర్వాత అందులో ఉన్న ఖైదీలను ఇతర జైళ్లకు పంపింది. దీంతో క్రౌడ్ మరింత పెరిగి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల హక్కులు గుర్తించి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంతోపాటు, జైళ్ల శాఖ ఉద్యోగుల సమస్యలూ తీర్చాల్సిన అవసరం ఉంది.
నేరాలను ప్రోత్సహించే సామాజిక పరిస్థితులను పూర్తిగా తొలగించడమో లేదా కనీస స్థాయికి తగ్గించడమో చేయాలి. అప్పుడే నేర రహిత సమాజం ఏర్పడుతుంది. రాష్ట్రంలో జైళ్లలో ఉన్న వారిలో ఎక్కువ మంది చిన్న చిన్న నేరాలకు పాల్పడి, బెయిళ్లు రాక, పూచీకత్తులు కట్టలేక, పేదరికం వల్ల మగ్గుతున్న వాళ్లే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖైదీల హక్కులు గుర్తించాలి. ఖైదీల హక్కులకు భంగం వాటిల్లినట్లు, జైళ్లలో వారిని పరిమితికి మించి పెడుతున్నట్లు సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చింది. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసిన తర్వాత పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని, జైళ్లు ఓవర్ క్రౌడ్అయిందని తేలింది. నిజానికి జైలు ఏరియాను బట్టి అందులో ఖైదీలను ఉంచాలి. హక్కులను కాపాడుతూ.. ఖైదీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలి. కానీ అలా జరగడం లేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జైళ్ల శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది. అయితే జైళ్ల పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. వారిని పరిమితికి మించి పెట్టడంతోపాటు వారి సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది.
మహిళా జైళ్లు ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క ప్రత్యేక మహిళా జైలు ఉంది. చంచల్ గూడ జైలులో మాత్రమే మహిళలకు ప్రత్యేకంగా జైలు ఉంది. కొన్ని నెలల నుంచి గంజాయి తదితర కేసుల కారణంగా మహిళా ఖైదీల సంఖ్య పెరుగుతోంది. కానీ వారి సంఖ్యకు సరిపోయే విధంగా జైళ్లు లేవు. ఉన్న ఒక్క ప్రత్యేక జైలులో 260 మందికి అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ కూడా పరిమితికి మించి ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి మహిళా ఖైదీల కోసం ప్రత్యేక జైలు ఏర్పాటు చేయాలి. అందులో మహిళా అధికారులను నియమించాలి. ప్రభుత్వం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని ప్రతి జిల్లాకు ఓ జైలు ఏర్పాటు చేసి అందులో ప్రత్యేక మహిళా లాకప్ పెట్టాలి. అప్పుడు వాళ్ల ఇబ్బంది తొలగడంతో పాటు ఉద్యోగులపై భారం కూడా తగ్గుతుంది.
ఉద్యోగుల విభజనలో అన్యాయం..
కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరుగుతోంది. జైలు వార్డర్‌ను రాష్ట్రస్థాయి ఉద్యోగం నుంచి జిల్లాస్థాయి ఉద్యోగిగా మార్చారు. ఇది వరకు వార్డర్ నుంచి పైఆఫీసర్వరకు అందరివీ రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా ఉండేవి. ఇప్పుడు వాటిని జిల్లా స్థాయి ఉద్యోగాలుగా మారుస్తున్నారు. సీనియారిటీ ప్రకారం కొంత మంది సీనియర్లకు సొంత జిల్లా పోస్టింగ్ వచ్చినా.. జూనియర్లకు అలా దొరకడం లేదు. వంద కిలోమీటర్ల దూరం పోయి ఉద్యోగం చేసే పరిస్థితి. అది సొంత జిల్లా ఉద్యోగం ఎలా అవుతుందని కొందరు వాపోతున్నారు. సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా దాటి ఉద్యోగం చేయాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో జైళ్లు లేకపోవడం వారికి సమస్యగా మారింది. మూతపడిన సబ్‌జైళ్లను తెరవడంతోపాటు, ప్రతి జిల్లాకు ఒక జైలు నిర్మాణం చేపట్టాలి. అప్పుడే అటు ఖైదీలకు, ఇటు జైళ్ల శాఖ ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది.
రాష్ట్రంలో మంచి సౌలత్‌లు ఉన్నా గతంలో కొన్ని సబ్ జైళ్లను మూసేశారు. వాటిని తెరిస్తే.. ఖైదీలతోపాటు జైళ్ల శాఖ ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆర్మూర్‌లో మంచి స్థలంలో ఉన్న సబ్ జైలు మూసేశారు. ఇలాంటివి రాష్ట్రంలో ఇంకా ఉన్నాయి. వాటన్నింటిని తెరవాలని ఉద్యోగులు కోరుతున్నారు. మూసేసిన వాటిని తెరవడంతోపాటు అన్ని సౌలత్‌లు ఉన్న నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా జైళ్లను సెంట్రల్ జైళ్లుగా మార్చాల్సిన అవసరం ఉంది. వరంగల్ సెంట్రల్ జైలును కూల్చి వేసిన తర్వాత జైళ్లలో ఖైదీల రద్దీ పెరిగింది. నిజామాబాద్, సంగారెడ్డి జైళ్లను సెంట్రల్ జైళ్లుగా మారిస్తే.. ఇబ్బంది కొంత తగ్గే చాన్స్ఉంటుంది. ఆధునిక జైళ్ల నిర్మాణం కూడా చేపట్టాలి. జిల్లాకు ఒక జైలు నిర్మాణం చేపట్టాలి.
వ్యవసాయాన్ని పవిత్ర వృత్తిగా భావించాలి
నేరాలను ప్రోత్సహించే సామాజిక పరిస్థితులను పూర్తిగా తొలగించడమో లేదా కనీస స్థాయికి తగ్గించడమో చేయాలి. అప్పుడే నేర రహిత సమాజం ఏర్పడుతుంది. రాష్ట్రంలో జైళ్లలో ఉన్న వారిలో ఎక్కువ మంది చిన్న చిన్న నేరాలకు పాల్పడి, బెయిళ్లు రాక, పూచీకత్తులు కట్టలేక, పేదరికం వల్ల మగ్గుతున్న వాళ్లే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖైదీల హక్కులు గుర్తించాలి. ఖైదీల హక్కులకు భంగం వాటిల్లినట్లు, జైళ్లలో వారిని పరిమితికి మించి పెడుతున్నట్లు సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చింది. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసిన తర్వాత పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని, జైళ్లు ఓవర్ క్రౌడ్అయిందని తేలింది. నిజానికి జైలు ఏరియాను బట్టి అందులో ఖైదీలను ఉంచాలి. హక్కులను కాపాడుతూ.. ఖైదీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలి. కానీ అలా జరగడం లేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జైళ్ల శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది. అయితే జైళ్ల పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. వారిని పరిమితికి మించి పెట్టడంతోపాటు వారి సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది.
మహిళా జైళ్లు ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క ప్రత్యేక మహిళా జైలు ఉంది. చంచల్ గూడ జైలులో మాత్రమే మహిళలకు ప్రత్యేకంగా జైలు ఉంది. కొన్ని నెలల నుంచి గంజాయి తదితర కేసుల కారణంగా మహిళా ఖైదీల సంఖ్య పెరుగుతోంది. కానీ వారి సంఖ్యకు సరిపోయే విధంగా జైళ్లు లేవు. ఉన్న ఒక్క ప్రత్యేక జైలులో 260 మందికి అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ కూడా పరిమితికి మించి ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి మహిళా ఖైదీల కోసం ప్రత్యేక జైలు ఏర్పాటు చేయాలి. అందులో మహిళా అధికారులను నియమించాలి. ప్రభుత్వం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని ప్రతి జిల్లాకు ఓ జైలు ఏర్పాటు చేసి అందులో ప్రత్యేక మహిళా లాకప్ పెట్టాలి. అప్పుడు వాళ్ల ఇబ్బంది తొలగడంతో పాటు ఉద్యోగులపై భారం కూడా తగ్గుతుంది.
- ముచ్కుర్ సుమన్ గౌడ్, సామాజిక కార్యకర్త