
హైదరాబాద్: చైతన్యపురి పరిధిలోని మారుతి నగర్ మారుతి హోమ్స్లో నివాసం ఉంటున్న రవీందర్ అనే ఆర్టీసీ ఉద్యోగి కూతురు లాలస చందన(18) ఇంట్లోని ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇటీవల జేఈఈ మెయిన్స్లో మంచి మార్కులు సాధించిన యువతి వరంగల్ NITలో సీట్ పొందినట్లు కుటుంబ సభ్యులు చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహానికి పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి చైతన్యపురి పోలీసులు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.