కోడింగ్ @ ఆన్లైన్
డిజిటల్‌గా రోబోటిక్ , కోడింగ్ క్లాసులు
కరోనా ఎఫెక్ట్‌తో రూటు మార్చిన స్టార్టప్స్
వన్ టీచర్ వన్ స్టూడెంట్ మెథడ్‌లో సెషన్స్
ఇంట్రెస్ట్ చూపుతున్న కిడ్స్, టీనేజర్స్
హైదరాబాద్, వెలుగు: వీడియో గేమ్స్, యాప్స్, రోబోటిక్స్ గురించి తెలుసుకోవాలని, ఓన్‌గా క్రియేట్ చేయాలని చాలామంది స్టూడెంట్స్‌కి ఉంటుంది. కిడ్స్, టీనేజర్స్‌కి రోబోటిక్స్, కోడింగ్ టాపిక్స్‌పై ఇంట్రెస్ట్ కూడా ఎక్కువే. కొద్దిమంది స్పెషల్ క్లాసెస్‌కి వెళ్తుంటారు. స్కూల్స్‌లోనూ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తుంటారు. కోడింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చే ఇనిస్టిట్యూట్లు, స్టార్టప్స్ లాక్ డౌన్ తో క్లోజ్అయినా.. తిరిగి డిజిటల్ మెథడ్‌లో స్టార్ట్ చేశాయి. వైట్ హాట్ జూనియర్స్, ఎస్ పీ రోబోటిక్స్ మేకర్ ల్యాబ్, రోబోటిక్స్ ఫర్ కిడ్స్ ఇనిస్టిట్యూట్స్ వంటివి ఆన్లైన్లో క్లాసులు కండక్ట్ చేస్తున్నాయి. స్టూడెంట్స్‌కి అర్థమయ్యేలా బేసిక్స్ నుంచి లైవ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి.
కోర్సులు ఇలా..
రోబోటిక్స్, కోడింగ్ నేర్పే ఇనిస్టిట్యూట్స్ సిటీలో వందకిపైగా ఉన్నాయి. పేరెంట్స్ వాటి వెబ్ సైట్లలోకి లాగిన్ అయితే ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. యూట్యూబ్‌లోనూ వీడియోలు అందుబాటులో ఉంచుతున్నారు. అవి విన్న తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. స్టూడెంట్స్ టైమింగ్స్‌కి అనుగుణంగా లైవ్ క్లాసెస్ ఉంటాయి. జూమ్ క్లాసెస్లా కాకుండా ఒక టీచర్, ఒక స్టూడెంట్ పద్ధతిలో క్లాసులు చెప్తున్నారు. గేమింగ్, యాప్ మేకింగ్, వెబ్ సైట్స్ క్రియేషన్స్, రోబోటిక్స్ అండ్ ఏఐ ఎలా కోడింగ్ చేయాలో బేసిక్ లెవల్స్ నుంచి ప్రాక్టికల్ గా కిడ్స్ తో చేయిస్తున్నారు. డేటా బేస్ నుంచి వాల్యూస్, కోడింగ్, డీకోడింగ్ వరకు నేర్పిస్తున్నారు.ఈ ఆన్లైన్ కోర్సులు వారం నుంచి నెలల వరకు స్టూడెంట్ ఏజ్, తీసుకున్న కోర్సుని బట్టి ఉంటున్నాయి.
బేసిక్స్ నుంచి…
ఆన్లైన్లో రోబోటిక్స్ గురించి తెలుసుకోవడం కొంచం కష్టమే. డైరెక్ట్‌గా చూస్తేనే పిల్లలకు ఫంక్షన్స్, కోడింగ్ తెలుస్తాయి. రోబోటిక్స్ గురించి అవగాహన ఉంటే ఓకే. మొదటిసారిగా నేర్చుకోవాలనుకునే వారికి మాత్రం ఎలక్ట్రానిక్స్‌లో బేసిక్స్ నుంచి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. జనరల్‌గా హార్డ్ వేర్ పైన ఎలక్ట్రానిక్ కోడింగ్ నేర్పిస్తారు. ఆ హార్డ్ వేర్కి ప్రస్తుతం కాస్ట్ ఎక్కువగా ఉండడంతో ఆన్లైన్లో ఇతర సాఫ్ట్ వేర్స్ ద్వారా నేర్పిస్తున్నారు. పిల్లలు డిజిటల్ లైవ్ సెషన్స్ ద్వారా క్లాసులు వింటున్నారు. సొంతంగా యాప్స్ క్రియేట్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు.
గేమ్ కోడింగ్ నేర్చుకుంటున్నా
వీడియో గేమ్స్, సైన్స్ అంటే ఇష్టం. స్కూల్ లో వర్క్ షాప్ కండెక్ట్ చేస్తే పార్టిసిపేట్ చేసేవాణ్ని. నా ఇంట్రెస్ట్ చూసి మా పేరెంట్స్ ఆన్లైన్ క్లాస్‌లో జాయిన్ చేశారు. వైర్లెస్ బజర్ గేమ్ కోడింగ్ గురించి నేర్చుకుంటున్నా. టీచర్ ప్రాజెక్ట్ అసైన్ చేసి, ఎలా చేయాలో చూపిస్తారు. కోడింగ్ ఎలా చేయాలో చెప్తారు. ఇంట్రెస్టింగ్ ఉంది.
‑ అరవింద్, నైన్త్ క్లాస్ స్టూడెంట్, జూబ్లీహిల్స్
డిజిటల్‌గా స్టార్ట్ చేశాం
రోబోటిక్స్ నేర్చుకోవాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. కొత్తగా నేర్చుకునేవారికి డిఫికల్ట్ గా ఉంటుంది. కోడింగ్‌పై చాలామంది స్టూడెంట్స్‌కి ఇంట్రెస్ట్. పదేండ్ల పిల్లలు కోడింగ్ లో బేసిక్స్ నేర్చుకోవాలంటే 45 రోజులు పడుతుంది. సమ్మర్లో స్కూల్స్, ఇనిస్టిట్యూట్స్‌లో ఎక్కువగా క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు. ఈ సారి సిటీలో 50 స్కూల్స్‌లో వర్క్ షాప్స్ చేయాల్సి ఉండగా, లాక్ డౌన్ తో క్యాన్సిల్అయ్యాయి. దాంతో డిజిటల్‌గా స్టార్ట్ చేశాం. ఫీజు 10వేల నుంచి 25వేల వరకు ఉంటుంది.
‑ తైమేశ్వర్ రెడ్డి, మాయా ల్యాబ్స్
For More News..