మెదక్: తండాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. మెదక్ జిల్లా గిద్దెకట్ట దగ్గర దోబీ ఘాట్ కు ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత రాందాస్ చౌరస్తాలో రోడ్ స్విపింగ్ మిషన్ ను ప్రారంభించారు. మెదక్ శివారులో రూ.420 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల భవనానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ కోసం 300 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. తండాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగుల నిర్మాణం కోసం 600 కోట్లు కేటాయించామన్నారు. మెదక్ లో మూడు గిరిజన రెసిడెన్షియల్ విద్యా సంస్థల కోసం నిధులు ఇచ్చామని మంత్రి హరీశ్ రావు వివరించారు.
ఇవి కూడా చదవండి
పోషకాహారం అందించే ఏజెన్సీలపై సర్కార్ కీలక నిర్ణయం