ప్రతీ పంచాయతీలో వెయ్యి మొక్కలు నాటాలి: జితేశ్ ​వి పాటిల్​

కామారెడ్డి, వెలుగు: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో 5.26 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించిందని, ఇందులో భాగంగా ప్రతీ పంచాయతీలో వెయ్యి చొప్పున మొక్కలు నాటాలని కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​ఆఫీసర్లకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో హరితహారం, పండ్ల తోటల పెంపకంపై జరిగిన మీటింగ్​లో  ఆయన మాట్లాడుతూ.. స్కూల్స్​లో చింత, మునగ, వెలగ, ఉసిరి మొక్కలు నాటాలని, ప్రతీ ఇంటికి అయిదు రకాల ఔషధ మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో  వెయ్యి ఎకరాల్లో పండ్ల తోటలు పెంచేలా టార్గెట్ ​పెట్టుకున్నట్లు చెప్పారు. జడ్పీ సీఈవో సాయాగౌడ్,  డీఆర్డీవో సాయన్న,  ఎంపీడీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.

ఈనెల 21న ఓటర్​లిస్ట్ ​డ్రాఫ్ట్ ​నోటిఫికేషన్​

ఈ నెల 21న ఓటరు లిస్ట్ ​డ్రాఫ్ట్​ నోటిఫికేషన్ ​వెలువడనున్నట్లు కలెక్టర్ ​జితేశ్​ ​వి పాటిల్ ​తెలిపారు. బుధవారం  పొలిటికల్ లీడర్లతో జరిగిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్​1 నాటికి 18 ఏండ్లు నిండే వారు ఓటరుగా  నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్ల నమోదు కోసం ఈ నెల 26, 27, సెప్టెంబర్​2,3 తేదీల్లో ప్రత్యేక నమోదు ప్రోగ్రామ్స్​ ​నిర్వహించనున్నట్లు చెప్పారు. అక్టోబర్​ 4న ఫైనల్ ​ఓటర్ ​లిస్ట్​రిలీజ్​ చేస్తామన్నారు.