అత్యధిక భారత బ్యాంకులు నెట్ బ్యాంకింగ్‌లోనూ, తమ బ్యాంకు సంబంధించిన యాప్స్ లోను ప్రాణమైన ‘వన్ టైం పాస్‌వర్డ్’ సెల్‌ఫోన్ కే పంపుతున్నారు. దీని వలన సుమారు 20% నెట్‌బ్యాంకింగ్ లోను మరియు బ్యాంకు సంబందించిన యాప్స్ లోను వెనకపడుతోంది. అందుకు ముఖ్యకారణాలు ఒక్కోసారి సెల్‌ఫోన్ దగ్గర ఉండక పోవటం, ఉన్నా కొన్ని ఊళ్లలో, పట్టణాల్లో నెట్‌వర్క్ పనిచేయదు. అనుకోని పరిస్థితుల్లో సెల్ పాడైపోయినా, దొంగిలించబడినా, నెట్ బ్యాంకింగ్ పని ఆగినట్లే. అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సివస్తే ఇక నెట్ బ్యాంకింగ్ పని గోవిందా.
ఇక తప్పని సరిగా నగదు లేక చెక్కులతో చేబదుళ్లతో లావాదేవీలు చేయక తప్పట్లేదు. అందుకే నెట్ బ్యాంకింగ్ లో ‘వన్ టైం పాస్‌వర్డ్’ బ్యాంకు అకౌంట్ లో రికార్డు అయిన సెల్ కి, మరియు ఇమెయిల్ కి పంపేలా సదుపాయాన్ని అన్ని బ్యాంకులు కల్పించాలి. అందుకు వీలుగా సత్వరం తమ సాఫ్ట్ వేర్ లో మార్పులు చెయ్యాలి. ఈ సదుపాయం కలిగిస్తే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మరియు బ్యాంకు యాప్స్ తో నిరాఘాటంగా పని చేయటానికి వీలవుతుంది. రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా, ఆర్ధికమంత్రిత్వ శాఖ అన్నిబ్యాంకులనూ ఆదేశించాలి.
ఈ పద్ధతి అన్ని బ్యాంకులూ సత్వరం పాటిస్తే మన ప్రధాని నరేంద్ర మోదీ కలలు కన్న నగదు రహిత లావాదేవీలు వంద శాతం నెరవేరుతాయి. నెట్ బ్యాంకింగ్ లో ఓటీపీ దేనికి పంపాలి. మీ ‘సెల్ ఫోన్’ కా,- లేక - ‘ఈమెయిల్’ కా అనే ఆప్షన్ తమ ఖాతాదారులకు అన్ని బ్యాంకులూ వెసులుబాటు కల్పించాలి. దాంతో ఖాతాదారుల ఇబ్బందులు తొలుగుతాయి. నగదు రహిత లావాదేవీలూ బాగా పెరుగుతాయి.
- సీ.వీ.ఆర్.కృష్ణ, అడిక్‌మెట్, హైదరాబాద్