హైదరాబాద్లో వాటర్ బిల్ బకాయిలు చెల్లించేందుకు లాస్ట్ డేట్ నవంబర్30

  • ఈ నెల 30 వరకు పొడిగించిన వాటర్​బోర్డు
  • నెల రోజుల్లో రూ.49కోట్ల బిల్లులు వసూలు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: వాటర్ బోర్డు అమలు చేస్తున్న వన్ టైం సెటిల్​మెంట్(ఓటీఎస్) పథకాన్ని మరో నెల రోజులు పొడిగించింది. ఈ నెల 30 వరకు పథకం అందుబాటులో ఉంటుందని, సిటీ ప్రజలు వినియోగించుకోవాలని బోర్డు ఎండీ అశోక్​రెడ్డి సూచించారు. 

ఓటీఎస్​స్కీంను పొడిగించాలని వినియోగదారుల నుంచి రిక్వెస్టులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఓటీఎస్​ద్వారా అక్టోబర్ 31 వరకు బోర్డుకు రూ.49 కోట్ల ఆదాయం వచ్చిందని, 70,335 మంది వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. 

నీటి బిల్లుల మొండి బకాయిలు వసూలు చేసేందుకు వాటర్​బోర్డు ఓటీఎస్​స్కీంను తీసుకొచ్చింది. ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. మొదట అక్టోబర్ 1 నుంచి 31 వరకు స్కీం అమలులో ఉంటుందని ప్రకటించగా, దసరా, దీపావళి వంటి పండుగ సందర్భంగా జనం పెద్దగా వినియోగించుకోలేకపోయారు. దీంతో స్కీంను నవంబర్ 30 వరకు పొడిగించింది.