సికింద్రాబాద్ , వెలుగు : పండుగల సీజన్ రద్దీని పురస్కరించుకొని పలు మార్గాల్లో నాలుగు రోజుల పాటు వన్ వే ట్రైన్ సర్వీస్ లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ట్రైన్ లు ఈ నెల 10, 11,12,13 తేదీల్లో నడుస్తాయని తెలిపారు. 10 మచిలీపట్నం- నుంచి సికింద్రాబాద్
11న సికింద్రాబాద్ నుంచి -తిరుపతి, 12న తిరుపతి నుంచి -కాకినాడ టౌన్ , 13న కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ మధ్య ఈ వన్ వే స్సెషల్ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ప్రకటనలో కోరారు.