One year for Balagam: బలగం సినిమాకు సంవత్సరం.. మరొక్కసారి.. అంటూ దర్శకుడి ట్వీట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బలగం(Balagam) సినిమా సాధించిన సంచలనం విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా అనూహ్య విజయం సాధించింది. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ప్రతీ ప్రేక్షకుడి చేత కన్నీళ్లు పెటించింది. దర్శకుడు వేణు ఈ కథను నడిపించిన తీరుకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. విమర్శకుల నుండి సైతం ప్రశంసలు దక్కించుకొని.. దేశ, విదేశాలలో గొప్ప గొప్ప అవార్డులను అందుకుంది బలగం సినిమా. 

తెలంగాణ సంస్కృతి, గ్రామీణ నేపధ్యం, అక్కడి ప్రజలు, వారి సంప్రదాయాలు, అలవాట్లు వంటి వాటిని కళ్లకు కట్టినట్టు చూపించారు. దాంతో ఆడియన్స్ ఈ సినిమాకు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా క్లిమక్స్ లో వచ్చే పాట ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఆ పాటకు కన్నీళ్లు పెట్టనివారంటూ ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేసిన వేణు ఎల్దండి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంటే చాలా మంది నమ్మలేదు. తన రచన, దర్శకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసాడు వేణు. 

ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమా విడుదలై (మార్చి 3)కి ఏడాది పూర్తయింది. ఈ సినిమా 2023 మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బలగం సినిమా విడుదలై సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశాడు దర్శకుడు వేణు ఎల్దండి.. బలగం సినిమాకు సంవత్సరం. ఈ సినిమాకు మద్దతుగా నిలిచిన, మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. అంటూ ట్వీట్ చేశారు వేణు. ప్రస్తుతం వేణు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.