- వేడినీళ్ల కోసం పెట్టిన కరెంట్ హీటర్ ముట్టుకోవడంతో ప్రమాదం
కోదాడ,వెలుగు:సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురంలో కరెంట్షాక్తో గురువారం ఏడాది వయసున్న బాలుడు చనిపోయాడు. గ్రామానికి చెందిన పాముల వెంకటనారాయణ దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్నవాడైన బిట్టుకు ఏడాది వయస్సుంటుంది.
గురువారం వెంకటనారాయణ భార్య వేడినీళ్లు పెట్టేం దుకు కరెంట్ హీటర్ ఆన్ చేసింది. అది కింద ఉండడంతో బిట్టు ఆడుకుంటూ వెళ్లి పట్టుకోగా షాక్కొట్టింది. దీన్ని ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటికి వెంకటనారాయణ భార్య చూడగా బిట్టు చనిపోయి ఉన్నాడు.