బావిలో పడిన చిన్నారిని కాపాడిన రెస్క్యూ టీం

బావిలో పడిన చిన్నారిని కాపాడిన రెస్క్యూ టీం

మధ్యప్రదేశ్ లో బోరువావిలో పడిన ఓ చిన్నారిని రెస్క్యూ టీంలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఆరు గంటలపాటు వారి పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఛతార్ పూర్ లో ఏడాది వయసున్న పాప.. నిన్న మధ్యాహ్నాం ఆడుకుంటూ వెళ్లి 15 అడుగుల లోతున్న బోరువావిలో పడిపోయింది. చిన్నారి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన అధికారులు సాయంత్రం 4 గంటల టైంలో రెస్క్యూ ప్రారంభించారు. ఆర్మీ జవాన్లు కూడా సహాయకచర్యల్లో పాల్గొన్నారు. సిలిండర్ల ద్వారా బోరుబావిలోకి ఆక్సీజన్ పంపించారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. రాత్రి పన్నెండున్నర టైంలో చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ సిబ్బందికి స్థానికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. భారత్ మాతాకి జై నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.