
- ఒకరిని కాపాడిన స్థానికులు.. మరొకరు గల్లంతు
- వరంగల్ జిల్లా కొంకపాక శివారులో ఘటన
పర్వతగిరి, వెలుగు : ఎస్సారెస్పీ కెనాల్ లో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు పడ్డారు. వీరిలో ఒకరిని స్థానికులు కాపాడారు. మరో యువకుడు కొట్టుకుపోయిన ఘటన వరంగల్జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ఎల్బీ నగర్‌కు చెందిన నలుగురు యువకులు ఆదివారం అన్నారం బాబా దర్గాకు ఆటోలో వెళ్లారు. దర్శనాంతరం వరంగల్‌కు తిరుగు వెళ్తుండగా రెహమాన్ అనే యువకుడిని బురద అంటడంతో కొంకపాక శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఆటో ఆపారు.
క్లీన్ చేసుకునేందుకు కెనాల్ లోకి దిగడంతో ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయాడు. ఖలీమ్చూసి వెంటనే కాపాడేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఖలీమ్కూడా పడిపోగా స్థానికులు చూసి వెంటనే అతడిని రక్షించారు. మరో ఇద్దరు యువకులు భయపడి ఆటోలో వెళ్లిపోయారు. సమాచారం అందడంతో పర్వతగిరి పోలీసులు వెళ్లి గల్లంతైన రెహమాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.