ఊరిస్తున్న వన్ ప్లస్ 7: ఫాస్ట్ అండ్ స్మూత్

ఊరిస్తున్న వన్ ప్లస్ 7: ఫాస్ట్ అండ్ స్మూత్

కొత్త ఫోన్ రిలీజ్ కు ముందు ఫీచర్లపై రకరకాల లీకులతో ఆకర్షించడమే ట్రెండ్ గా మార్చింది చైనా మొబైల్ కంపెనీ వన్ ప్లస్. ఇండియాలో వేగంగా మార్కెట్ పెంచుకుంటూ ప్రీమియం సెగ్మెంట్లో యాపిల్, శాంసంగ్ కు గట్టి పోటీ ఇస్తోంది. వచ్చేనెల్లో కొత్త మోడల్ వన్ ప్లస్ 7 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటివరకు మొబైల్ నిపుణుల లీకులకే పరిమితమైన ఈ మోడల్ పై తాజాగా కంపెనీ సీఈవో పీట్ లూ మొదటిసారి 5 సెకన్ల టీజర్ రిలీజ్ చేశాడు. వన్ ప్లస్ 7తో పాటు 7ప్రో అనే అప్ గ్రేడెడ్ మోడల్ ఇస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ టీజర్ 7ప్రోదేనని భావిస్తున్నారు. నలుపు బ్యాగ్రౌండ్ లో కర్వడ్ స్క్రీన్ తో మొబైల్ అంచు మాత్రమే వెలుగులో కనిపిస్తున్న ఈ టీజర్ కు ‘‘ఫాస్ట్ అండ్ స్మూత్’’ అనే ట్యాగ్ ఉంది. పేరు లేకుండా రాబోయే కొత్త డివైస్ ఇదేనని రాసిన పీట్ ఇంతకంటే వివరాలు బయటపెట్టలేదు. ఈ మోడల్ ‘‘ఫాస్ట్ అండ్ స్మూత్ విషయంలో కొత్త శకాన్ని ఆవిష్కరిస్తుంది’’ అని రాశాడు. ఫాస్ట్ గా పనిచేసే డివైస్ కంటే స్మూత్ డిజైనే పెద్ద సవాలనీ, ఈ రెండూ కలిస్తే హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ పోటాపోటీగా ఉంటాయన్నాడు పీట్. కొత్త డివైస్ చాలా అందంగా ఉంటుందని ఊరించాడు.

వన్ ప్లస్ 7ప్రోలో మొదటిసారిగా ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ ప్లే ఉండబోతోందని తెలుస్తోంది. అంటే మొబైల్ అంచు వంపులో కూడా స్క్రీన్ కనిపిస్తుంది. ఫీచర్లపై వివరాలు అధికారికంగా చెప్పకున్నా టెక్ నిపుణుడు ఇషాన్ అగర్వాల్ కొన్ని కీలక వివరాలు బయటపెట్టాడు. దీని ప్రకారం 90హెర్జ్ రేట్ తో క్యూహెచ్డీ డిస్ ప్లే ఉండనుంది. అంటే మొబైల్ స్క్రీన్ సెకనుకు 90 సార్లు రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడున్న ఫోన్లలో 60హెర్జ్ సామర్థ్యం మాత్రమే ఉంది. అసూస్ కంపెనీ తెచ్చిన హైఎండ్ మొబైల్ ఫోన్ ‘రేజర్’లో మాత్రమే ఇప్పటివరకు 90హెర్జ్ డిస్ ప్లే ఉంది. 7ప్రోలో అత్యధిక సామర్థ్యం ఉండే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855 ఎస్వోసీ వాడుతున్నారు. దీన్ని మే 14న న్యూయార్క్, యూకే, బెంగళూరులో ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది.

వన్ ప్లస్ 7 ప్రో ఫీచర్స్ ఇవే?

6.6 ఇంచెస్ డిస్ ప్లే (స్టాండర్డ్ వర్షన్ కు 6.4 ఇంచెస్)

8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

90హెర్జ్ రేట్ తో కూడిన క్యూహెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే

ట్రిపుల్ కెమెరా: 48ఎంపీ ప్రైమరీ, 16ఎంపీ వైడ్ యాంగిల్, 8ఎంపీ టెలిఫొటో లెన్స్ (స్టాండర్డ్ వర్షన్ లో డ్యూయల్)

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855 ఎస్వోసీ

4000 ఎంఏహెచ్ బ్యాటరీ

20 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయ్యే వార్ప్ చార్జ్

యూఎస్బీ 3.1

కింది భాగంలో డ్యూయల్ స్పీకర్స్