స్మార్ట్ టీవీలు ఉత్పత్తి చేస్తున్న ప్రముఖ కంపెనీల్లో One Plus ఒకటి. కస్టమర్లకు అందుబాటులో ధరలతో స్మార్ట్ టీవీలను అందిస్తున్న ఈ కంపెనీ గత కొద్ది కాలంగా కొత్త టీవీలను ఇండియా మార్కెట్లోకి విడుదల చేయడంలేదు.. దీంతో పాటు టాబ్లెట్ పీసీలు, ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల తయారీ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇటీవల కాలంలో తన వెబ్ సైట్లో ప్రాడక్ట్ ల లైనప్ ను పూర్తిగా తగ్గించింది OnePlus. ఇదంతా చూస్తుంటే OnePlus కంపెనీ స్మార్ట్ టీవీల తయారీని నిలిపివేసినట్లు సంకేతాలు సూచిస్తున్నాయి.
అయితే One Plus ఈ నిర్ణయాన్ని రాత్రి రాత్రే తీసుకోలేదని.. Oppo తో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పటినుంచి జనాదరణ పొందిన ఉత్పత్తులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. OnePlus స్మార్ట్ టీవీలు ఇండియా మార్కెట్లో బాగానే అమ్ముడు పోయినప్పటికీ.. స్మార్ట్ ఫోన్ల కంటే తక్కువ బిజినెస్ చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ల విషయంలో కస్టమర్లు ప్రతి రెండు మూడు సంవత్సరాల్లోకొత్త ఫోన్లకు మారుతారు.. అదే టీవీలు అయితే మినిమం 10 సంవత్సరాలు పడుతుందని అంచనాకు వచ్చారు. దీంతోపాటు షియోమికి మార్కెట్ లో తన ఉత్పత్తుల అమ్మకంలో స్పష్టమైన లీడింగ్ లో ఉంది. ఆ తర్వాత శామ్ సంగ్ , Vu, TCL వంటి ఇతర బ్రాండులు మార్కెట్ లో బాగా అమ్ముడుపోతున్నాయి.
OnePlus, Realme స్మార్ట్ టీవీ సెగ్మెంట్ నుంచి తప్పుకున్నాయి. Xiaomi కూడా ఇకపై ల్యాప్ టాప్ లను దేశంలో విక్రయించే అవకాశం లేదు. కస్టమర్లు కూడా కొత్త బ్రాండ్ లనుంచి ప్రాడక్టులను ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. దీంతో OnePlus టాబ్లెట్ పీసీలు, ఫోల్డబుల్ ప్రాడక్ట్ ల వైపు మొగ్గు చూపుతోందని నిపుణులు అంటున్నారు.