OnePlus తొలి ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ ‘ఓపెన్​’.. లాంచ్, ఫీచర్స్​ వివరాలివే..

OnePlus తొలి ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ ‘ఓపెన్​’.. లాంచ్, ఫీచర్స్​  వివరాలివే..

మార్కెట్​లో అనేక ఫోల్డెబుల్​స్మార్ట్​ఫోన్స్​ ఉన్నాయి. స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థలు కూడా వీటిపై ఎక్కువగానే ఫోకస్​ చేస్తున్నాయి. అయితే.. వన్​ప్లస్​ సంస్థకు ఈ సెగ్మెంట్​లో ఇంకా ఒక్క మోడల్​ కూడా లేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు వన్​ప్లస్​ ఓపెన్​ అనే పేరుతో ఒక ఫోల్డెబుల్​ ఫోన్​ను త్వరలో లాంచ్​ చేయనుంది. ఈ డివైజ్ అక్టోబర్ నెలలోనే లాంచ్​ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​వివరాలను ఓసారి చూద్దాం..

కొత్త స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ ఇవేనా..?

పలు లీక్స్​, నివేదికల ప్రకారం.. వన్​ప్లస్​ ఓపెన్​లో ఇన్​వర్డ్​ ఫోల్డింగ్​ డిజైన్​ ఉంటుంది. టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​, సైడ్​ ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్లు.. లోపలి భాగంలో రైట్​- అలైండ్​ పంచ్​ హోల్​ రానుంది. అల్యుమీనియం ఫ్రేమ్​, గొరిల్లా గ్లాస్​ ప్రొటెక్షన్​ వంటివి లభించొచ్చు. 

ఈ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​లో ఫీచర్లు  
7.82 ఇంచ్​ క్యూహెచ్​డీ+ అమోలెడ్​ మెయిన్​ డిస్​ప్లే
6.31 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ ఔటర్​ స్క్రీన్​ 
 డివైజ్​లో 48ఎంపీ ప్రైమరీ, 48ఎంపీ అల్ట్రా వైడ్​, 64ఎంపీ పెరిస్కోపిక్​ కెమెరా సెటప్​ 
స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ఎస్​ఓసీ చిప్​సెట్​ 
16జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ 
ఆండ్రాయిడ్​ 14 ఆధారిత ఆక్సీజెన్​ ఓఎస్​ సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుందని తెలుస్తోంది. 4,800ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.
వన్​ప్లస్​ ఓపెన్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 1.20లక్షలుగా ఉండొచ్చని అంచనా.