చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి సిధ్దమైంది.. ఇప్పటికే ఇక్కడ ఆర్ అండ్ డీ సెంటర్ ని ప్రారంభించిన వన్ ప్లస్ ఇప్పుడు వరల్డ్ బిగ్గెస్ట్ స్టోర్ ని హైదరాబాద్ లో ప్రారంభిస్తామని ప్రకటించింది.. హైదరాబాద్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజురోజుకు పెరుగుతుండటంతో.. ఇక్కడి మార్కెట్ ని క్యాచ్ చేసుకోడానికి స్టెప్స్ వేస్తోంది ఈ చైనీస్ మొబైల్ కంపెనీ.
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనీస్ కంపెనీ వన్ ప్లస్ ఫ్లాగ్ షిప్ ఫీచర్స్ తో ఇండియన్ కస్టమర్స్ ని ఆకట్టుకుంది. ప్రీమియం మార్కెట్ ని శాసిస్తున్న శాంసంగ్, యాపిల్ లను వెనక్కి నెట్టి ముందుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా వన్ ప్లస్ ఫోన్లని విక్రయిస్తున్నా.. వాళ్లకి ఇండియానే పెద్ద మార్కెట్. ఇప్పటికే హైదరాబాద్ లో వన్ ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్ ఉంది. ఈ సెంటర్ ని గతేడాది ఇక్కడ ప్రారంభించింది వన్ ప్లస్.. అయితే హైదరాబాద్ లో ఆర్ అండ్ డీ సెంటర్ ని విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదిగా చేయాలని వన్ ప్లస్ ప్రణాళికలు చేస్తోంది. హైదరాబాద్ లో ఆర్ అండ్ డీ సెంటర్ లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్, మిషన్ లర్నింగ్, వర్క్ లైఫ్, క్రికెట్ స్కోర్లు, ట్రావెల్ రిలేటెడ్ ఫీచర్లను మెరుగు పర్చడానికి ఫీచర్లను డెవలప్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్లు త్వరలో రాబోయే స్మార్ట్ ఫోన్లలో తీసుకొస్తామని ప్రకటించింది వన్ ప్లస్.
వరల్డ్ బిగ్గెస్ట్ వన్ ప్లస్ స్టోర్ ని త్వరలో ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు ఆ సంస్థ కో ఫౌండర్ కార్ల్ పెయ్.. 16 వేల స్క్వేర్ ఫీట్స్ లో ఏర్పాటు చేయబోయే ఈ బిల్డింగ్ ఆర్ట్ ఆఫ్ మోడల్ గా ఉండనుందన్నారు. ఆరు అంతస్థుల బిల్డింగ్ లో అతిపెద్ద స్టోర్ గా నిలవనుందని తెలిపారు కార్ల్ పెయ్.. దీనికి సంబంధించిన ప్లాన్స్ ఇప్పటికే పూర్తయ్యాయని.. ఈ ఏడాది చివరికి దీన్ని పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. బిల్డింగ్ షేప్ ఆర్ట్ ఆఫ్ మోడల్ బిల్డింగ్ గా తీసుకొస్తామన్నారు కార్ల్ పెయ్. రెడ్ అండ్ వైట్ కలర్ తో అధ్భుతమైన డిజైన్ తో పాటు నేచురల్ లైటింగ్ వచ్చేలా ఈ బిల్డింగ్ నిర్మిస్తామన్నారు. నానో టెక్నాలజీతో తయారు చేసిన వైట్ కలర్ దుమ్ము ధూళిని తట్టుకోవడంతో పాటు సుధీర్ఘకాలంగా స్పష్టంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ హెరిటేజ్ తో పాటు సాంస్కృతిక కేంద్రంగానే కాకుండా ఎమర్జింగ్ ఐటీ అండ్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ది చెందిందన్నారు.