OnePlus Watch 3: లాంచ్ ఎప్పుడంటే.. డిజైన్, బ్యాటరీ డీటైల్స్ ఇలా ఉన్నాయి..

OnePlus Watch 3: లాంచ్ ఎప్పుడంటే.. డిజైన్, బ్యాటరీ డీటైల్స్ ఇలా ఉన్నాయి..

వన్ ప్లస్ వాచ్ 1, 2 తర్వాత ఇప్పుడు థర్డ్ జనరేషన్ వాచ్ ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది కంపెనీ. రిలీజ్ డేట్ ను వన్ ప్లస్ కంపెనీ కన్ఫామ్ చేసింది. అదే విధంగా వాచ్ ఫీచర్స్ ను కూడా చెప్పేసింది. లేటెస్ట్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, ఫీచర్స్ తో వస్తున్న వాచ్-3 వెరీ అట్రాక్టివ్ గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 

వన్ ప్లస్ వాచ్ లో వస్తున్న 3వ జనరేషన్ వాచ్ ఫిబ్రవరి 18న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఇండియాలో లాంచ్ చేయడం లేదని, మొదటగా యూఎస్ లా రిలీజ్ చేసి.. ఆ తర్వాత ఇండియాలోకి తెస్తామని అన్నౌన్స్ చేసింది. 

డిజైన్:

లేటెస్ట్ వాచ్ లాంగ్ బ్యాటరీ లైఫ్, గూగుల్ వేర్ ఓఎస్ (Wear OS) సప్పోర్ట్ తో పనిచేస్తుంది. OnePlus Watch 2 మాడల్ కు మరిన్ని ఫీచర్లతో ఇంప్రుమెంట్ తో వాచ్-3ని తెస్తోంది కంపెనీ. 2వ మోడల్ వాచ్ 100 గంటల బ్యాటరీ లైఫ్ తో డ్యుయెల్ ఆర్కిటెక్చర్ సిస్టమ్ తో కస్టమర్స్ ను ఇంప్రెస్ చేసింది. 

టెక్నాలజీ:

OnePlus Watch--3 స్నాప్ డ్రాగన్ డబ్ల్యూ5 చిప్ సెట్ ( Snapdragon W5 chipset) కలిగి ఉండి.. BES2800 MCU చిప్ తో పెయిర్ అయ్యి ఉంటుంది. 9To5Google అనే రిపోర్ట్స్ తో పర్ఫార్మెన్స్ బ్యాటరీ సామర్థ్యం అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 500mAh నుంచి 631mAh కెపాసిటీ ఉండే సిలికాన్న నానో చిప్ బ్యాటరీని ఈ లేటెస్ట్ మోడల్ లో ఇచ్చారు. దీని ప్రకారం 125 గంటల బ్యాటరీ ఉంటుందని వన్ ప్లస్ కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. 

యూఎస్, కెనడా, యూరప్ లో ఫిబ్రవరి 18 నుంచి లాంచ్ చేస్తు్న్నారు. అయితే ముందుగా బుక్ చేసుకున్న వారికి 30 డాలర్ల డిస్కౌంట్ ఇస్తోంది కంపెనీ. అదేవిధంగా OnePlus ఇయర్ బడ్స్ లేదా OnePlus Pad 2 లను గెలుచుకునే చాన్స్ ఉంది.